ప్రేమకి ఉండే ఒకే ఒక అడ్డంకి భయం మీ హృదయ స్పందనని అనుసరించండి. మరింతగా ప్రేమించండి. అదిచాలు. ఎక్కువ అనుభూతిని పొంది మరింత ఆనందంగా ఉండి హృదయానికి శక్తినివ్వండి. సూర్యోదయం, సూర్యాస్తమయం, మబ్బులు, ఇంద్రధనుస్సు, పక్షులు, పువ్వులు, మనుషులు ఇలా అన్నింటినీ గమనించండి. మనుషులని, వారి కళ్ళలోనికి చూడండి. సృష్టి ఎన్నో కోణాలలో ఉంటుంది. ఒక కవిలా అన్ని కోణాలలో చూడండి. దాన్ని అభినందించండి. ఆ అనుభూతి పొందండి. పారవశ్యంలో ఉండండి. మీ చేతన స్థితిని మరింత విస్తృతం చేయండి. సృష్టిలో ప్రతి దాన్ని ప్రేమతో చూస్తూ, ఆ అనుభూతిని పొందండి. క్రమంగా అహం తన పట్టుని పోగొట్టుకొని మాయం అయిపోతుంది. ప్రేమకి ఉండే ఒకే ఒక అడ్డంకి భయం. ఏదైనా జరగటం ప్రారంభంకాగానే మీరు భయపడతారు. ఎందుకంటే ప్రేమతో మనం కరిగిపోతాం. అది మన అహంకారానికి సవాలు. అహం అంటే తాను ప్రత్యేకం అని అనుకోవటం. అందుకే మనం