6

60 2 12
                                    

                                                                                              A

W.U (We - understand ) దేశం లోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ. నిత్య జీవితం లో అవసరాలను తీర్చే పరికరాల దగ్గర నుంచి మొదలు పెట్టి తమ పరికరాలను జీవనాధారం చేసేంతగా ఆ సంస్థ ఎదిగింది. ఈశ్వర్ పని చేసేది ఈ సంస్థలో నే కావడం తో, మైథిలి ఈశ్వర్ ఆచూకీ కనుక్కోడానికి అక్కడకి చేరుకుంది. ఈశ్వర్ మేనేజర్ తో పరిచయం ఉండడం తో ఆయననే నేరుగా కలసి ప్రశ్నించగా, వారం రోజుల క్రితమే ఈశ్వర్ తల్లి చనిపోయారని ప్రస్తుతానికి లీవ్ మీద ఉన్నాడని చెప్పారు. ఆ సంస్థ లో పనిచేస్తున్న ఈశ్వర్ స్నేహితులు కూడా ఈ వార్త తెలియగానే ఈశ్వర్ ను కలిసే ప్రయత్నం చేశామని, ఇల్లు తాళం వేసి ఉండిందని సమాధానం ఇచ్చారు. ఈ మాటలు విన్న మైథిలికి ఈశ్వర్ ని ఇటువంటి పరిస్థితులలో వెతికి పట్టుకొని వివరాలు అడగడం సరి కాదు అనిపించి అక్కడినుంచి బయల్దేరింది. మార్గ మధ్యం లో వెనక్కు పరిగెడుతున్న రహదారిని, చెట్లను చూస్తూ ఉండగా తన మనస్సు కూడా గత సంవత్సరం జ్ఞ్యాపకాలలోకి పరిగెట్టింది. పోయిన సంవత్సరం మనిషి -పెంపుడు జంతువుల సామరస్యం పై తమ వైద్యశాల నిర్వహించిన సదస్సు లో పాల్గొన్న అనేక సంస్థలలో W.U ఒకటి. వాళ్ళ తరఫున ప్రసంగం ఇవ్వడానికి వచ్చాడు ఈశ్వర్.

"నా పేరు ఈశ్వర్. నేనొక ఆటిస్టిక్ వ్యక్తిని. దాని వల్ల నాకు పెద్దగా సమస్యలు రాలేదు కానీ నన్ను పెంచడానికి నా తల్లి దండ్రులు కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు. చదువుకోవడం, ఉద్యోగం చేయడం లాంటివి ఎవ్వరి ఆధారం లేకుండా చెయ్యగలిగిన నాకు చుట్టు పక్కల వారితో సంబంధాలు నిలబెట్టుకోడం చేతనయ్యేది కాదు. కారణం మానవ సంబంధాలలో కీలక పాత్ర వహించే భావోద్వేగాలను నేను గుర్తుపట్టలేకపోవడం. నా తల్లి దండ్రుల లాగ నాకు ప్రతీదీ విడమరచి చెప్పాల్సిన అవసరం ఇతరులకు ఉండదు అని తెలుసుకున్నా. ఇప్పుడు పెంపుడు కుక్కల విషయానికి వద్దాం. ఒకప్పుడు విలాసానికి పెంచుకునే కుక్కలు, ఇప్పుడు కులాసాగా ఉండడానికి అవసరం. పిల్లలు లేని లోటు తీర్చాలంటే కుక్కలు కేవలం మన ఆదేశాలనే కాదు, ఆవేశాలనూ అర్థం చేసుకోవాలి అని నాకు కలిగిన అనుభవం తో తెలుసుకున్నా. W.U సంస్థలో ఇంతకాలం జంతువులకు కలిగే ఆకలి, దాహం, కోపం, భయం వంటి భావోద్వేగాలు మనుషులకు వ్యక్తపరిచే పరికరాలు తయారు చేసాం. ఇప్పుడు మనుషుల భావోద్వేగాలు జంతువులకు తెలియపరచే పరికరాన్ని తయారు చేయబోతున్నాం.

మానవ వినికిడి 20hz - 20khz ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్ద తరంగాలను పసిగట్టగలిగితే, కుక్కలు 40hz - 60khz మధ్య ఉన్నశబ్ద తరంగాలను పసిగట్టగలవు. దీపావళి బాణాసంచా కాల్చినప్పుడు, భూకంపాలప్పుడు మనకు వినబడని సూక్ష్మమైన శబ్ద తరంగాలకు కుక్కలు స్పందించడం మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టే కుక్కలకు శిక్షణ ఇచ్చేటప్పుడు అల్ట్రాసోనిక్ శబ్ద తరంగాలను వెలువరచే నెల్సన్ విజిల్స్ ను కొన్ని చోట్ల ఉపయోగిస్తారు. కుక్కలకు ఉండే ఈ శక్తిని ఆధారం చేసుకొనే మానవ భావొద్వేగాలను పసిగట్టే పరికరం తయారు చేయాలన్నది మా ప్రయత్నం.

మన భావొద్వేగాలను బట్టే మనం శ్వాస తీసుకునే విధానం, గుండె కొట్టుకునే విధానం ఆధారపడి ఉంటాయి. కుక్క ప్రవర్తన పట్ల మనకు కలుగుతున్న భావాలకు తగట్టు శ్వాస ప్రక్రియ మరియు గుండె చప్పుడు లో వచ్చే సూక్ష్మమైన మార్పులను అల్ట్రాసోనిక్ శబ్ద తరంగాలుగా విడుదల చేస్తాము. ఈ తరంగాలకు ముందే శిక్షణ పొంది ఉన్న పెంపుడు కుక్క, యజమాని మనసుకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే మనిషి-కుక్కల మానసిక స్థితిగతుల పై అవగాహన ఉన్న మీ వైద్యశాల సహకారం మాకు కావలి."

కుక్కWhere stories live. Discover now