3

101 6 29
                                    


మైథిలి వైద్యశాల చేరుకునే సరికి జిమ్మీ నిద్ర లేచింది. జిమ్మీ ఉండే గదికి ఇనుప ఊచల తలుపు ఉంది. వాటి నుంచి మైథిలిని చూడగానే జిమ్మీ ఎప్పటి లాగానే తోక ఊపుతూ దగ్గరకి వచ్చింది. మైథిలి వైద్యశాల సిబ్బందిని జిమ్మీ రక్తం, ఎంగిలి, మూత్రం నమూనాలు తీసుకొని పరీక్షకు పంపమనిన్ది. వాటి ఫలితాలు వచ్చే లోపు కుక్కలకి సాధారణంగా తాను పెట్టె మానసిక పరీక్షలు చేయసాగింది. చెప్పిన మాట వింటోంది లేదా, వేటికి భయపడుతోంది, వేటికి కోపం వస్తోంది , దాని reflexes మొదలైనవి పరీక్షించడానికి ఆ వైద్యశాలలో పలు రకాల పరికరాలు ఉన్నయి. జిమ్మీ కి చెప్పిన మాట వినే శిక్షణ స్వయంగా మైథిలి నే ఇచ్చింది. ఈ పరీక్షలన్నిటిలో మైథిలి అంతకముందు జిమ్మీ లో చుసిన ప్రవర్తననే చూసింది. జిమ్మీ కి వాక్సినేషన్ కూడా మైథిలినే చేయించింది. అనుకున్నట్టు గానే జిమ్మీ నమూనాలలో ఎటువంటి రోగాల ఉనికి కనపడలేదు.

కుక్కల ప్రవర్తన గురించి తాను చదువుకున్న ఏ విషయం తోను తాను జిమ్మీ లో చుసిన ప్రవర్తన ని పోల్చుకోలేక పోయింది. ఈ విషయాలను తన supervisor తో చర్చించగా ఆయన జిమ్మీ కి ఏవి పడదో కనుక్కున్నారు. పక్షులన్నా, గ్యాస్ సీలిండర్ల శబ్దమన్నా, కొన్ని రకాల పూల వాసనా అన్నా జిమ్మీ కి పడదు అని మైథిలి చెప్పడం తో ఆయన ఆ రోజు వాళ్ళ ఇంట్లో వీటికి సంబంధించిన ఎదో ఒక వస్తువుని ఇంటికి తేవడం లాంటివి చేసుంటారని చెప్పారు. కొన్ని రోజులు ఆగి వాళ్ల ఇంటికి వెళ్లి మరికొన్ని వివరాలు సేకరించవచ్చనీ, అంతవరకు జిమ్మీ ని పర్యవేక్షణ లో పెట్టి గమనించమనీ, ఇటువంటి సమస్యలు తానూ అంతకముందు కొన్ని పరీక్షించారని చెప్పారు. ఆయన చెప్పినట్టే మైథిలి జిమ్మీ ని పర్యవేక్షణ లో పెట్టింది. రెండు మూడు రోజులైనా జిమ్మీ ప్రవర్తన లో ఎటువంటి అనుమానించాల్సిన విషయమూ కనపడలేదు. మైథిలికి ఆ రోజు రాత్రి తాను జిమ్మీ లో చుసిన ప్రవర్తన తీవ్రత ని తన supervisor కి సరిగ్గా వ్యక్తపరచలేదు అనిపించింది. ఎందుకంటే ఇటువంటి ప్రవర్తన ఏ record లోను తాను చూడలేదు. కాబట్టి తన supervisor కి కూడా తెలిసే అవకాశం లేదు. ఈ విషయం లో తనని పూర్తిగా అర్థం చేసుకొని తనకి సూచన ఇచ్చే తోడు కోసం ఆలోచిస్తుండగా, అంతవరకు తాను తలుచుకోడానికి మనసుని నివారించుకుంటున్న ఒకే ఒక వ్యక్తి మాత్రమే తోచాడు.

కుక్కWhere stories live. Discover now