ప్రేమ ఐదురకాల అస్థిరత్వాల్ని అసహనాల్ని బాగుచేస్తుంది ప్రేమ అనే మాట చాలా అర్దాలతో నిండిపోయి ఉన్నది. దానికి ఇచ్చిన వ్యాఖ్యానాలు నానా అర్దాలతో నిండిపోయాయి. కారణంలేని నిస్వార్థ, ఆధ్యాత్మిక ప్రేమని ఒక పక్కన పెడదాం. ముందుగా మనం సాధారణమైన, మామూలు ప్రేమ అన్నింటినీ స్వంతంచేసుకునే భావన, అసూయ, ఇటువంటి సైడ్ఎఫెక్ట్తో ఉండే ప్రేమ గురించి చూద్దాం. ఇటువంటి ప్రేమ కూడా మీ శరీరానికి, మనస్సుకి చాలా మంచి చేస్తుంది. తరువాత మనం నిస్వార్ధ, ఆధ్యాత్మిక, పరిణతి చెందిన ప్రేమ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు ఒక పత్రికలో వ్యాసం చదివాను. దాని పేరు ఎప్పటికీ జీవించి ఉండండి (లివ్ ఫర్ ఎవర్). అది చదివి ఆశ్చర్యపోయాను. అందులో మీ జీవితాన్ని మరొక ఇరవై సంవత్సరాలు పెంచగలిగే పదకొండు పద్ధతులు ఇచ్చారు. ఆ పద్ధతులకి ఆధారంగా కొంత గణాంకాలని కూడా చూపించారు. ఆ పదకొండు పద్ధతులూ ప