my kavitha on lyricist anantha sriram

301 3 2
                                    

our kavitha on ananth sriram garu

ఈడు జోడు గా ఉండే ఈ నాటి కుర్రకారు జంటలను కాదంటే ఔననిలే అని అభివర్ణిస్తూ ....!!!

ఒక ఊరిలో...... అందరివాడు గా నిలిచి పద బొమ్మరిల్లు ని అల్లుకొని స్టాలిన్ లా సినీ వినీలాకాశం లో మహారధి గా నిలుస్తూ.....

మున్నా అన్నా యమదొంగ అన్నా చందమామ ని దొంగిలించి కంత్రి గా పరుగు లు తీస్తూ కొత్త బంగారు లోకాన్ని చేరి శశిరేఖను తలపించే స్వాతి ని పరిణయం ఆడి...... ఆకాశమంత అరుంధతి ని చూపించి ఒక మిత్రుడు గా మెలుగుతూ నేను పిస్తాను కాదోయి!!!!!

అంటూ కుర్రాడి గా ప్రతి చెలితో యే మాయ చేసావె డార్లింగ్ అనిపిస్తూ .... రామ రామ కృష్ణ కృష్ణ అంటూ శుభప్రదం గా మర్యాద రామన్న లా కనిపిస్తున్నా...

 బృందావనం లో కృష్ణుని చేష్టలను మరిపిస్తున్నాడు..

మా ఆయన "మిస్టర్.పర్ఫెక్ట్" నాన్నా అని కితాబు పుచ్చుకున్న ఘనుడు .

గేయ పదావళికి దడ పుట్టిస్తూ ఊసరవెల్లి లా తన పంథా మారుస్తూ ప్రతీ పాట అలా మొదలైంది  రాజన్న అంటూ యుగళ గీతాలకు బాడీగార్డ్ గా నిలుస్తూ ఇష్క్ లవ్లీ వంటి పదాలను ఈగ కు అన్వయిస్తూ నిలచిన సుడిగాడు.

రొటీన్ లవ్ స్టోరీ తో కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపిస్తూ ఎటో వెళ్ళిపోయిన మనసు దేనికైనా రెడీ అంటూ సీతమ్మ వంటి కళామతల్లి వాకిట్లో సిరిమల్లె చెట్టు గా విరిసిన నేటి మేటి గేయ విరించి.!!!!

"ఆత్రేయ ఆరుద్ర శ్రీశ్రీ వంటి గేయ త్రిమూర్తులను స్మరింపజేయ అభినవ దత్తాత్రేయుని గా అభివర్ణించదగ్గ శ్రీరాముడు మన అనంత్ శ్రీరామ్."

                            రాయరావ్ శ్రీరామ్


You've reached the end of published parts.

⏰ Last updated: Sep 29, 2015 ⏰

Add this story to your Library to get notified about new parts!

My kavitha on lyricist Anantha SriramWhere stories live. Discover now