నవయుగం

4 1 2
                                    

కుల నిర్మూలనా(అన్ని కులాల వారికి వంద శాతం రిజర్వేషన్లు)
పోటి అనేది ఇద్దరు సమాన వ్యక్తుల మధ్యా ఉండాలి.బలహీనునికి,బలవంతునికి పోటి పెట్టడం న్యాయం కాదు.అందుకే మహానుభావుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ని తెచ్చి బలహీనులను బలవంతులు గా మార్చారు. బ్రిటీష్ వాళ్ళు భారతీయులను 200 సంవత్సరాల్లు బానిసలుగా చూసారని మనకు తెలుసు. కానీ ఎన్నో శతాబ్దాలుగా మన భారతీయులు మన వాళ్ళని బానిసలుగా చూసారు. అధిక జాతుల వారు అణగారిన వర్గాలను అంటరాని వాళ్ళను చేసి,కుక్కల కంటే హీనంగా చూసి అవమానించారు.అందుకే బలహీనులు అయిన అణగారిన జాతులకు అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టి అందరినీ సమానులుగా చూడాలనుకున్నారు.ఈరోజు ఆడబిడ్డ చదువుకుంటోంది,ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడుతోంది అంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారు.అంబేద్కర్ గారి కంటే ముందు ఎందరో మహానుభావులు స్త్రీల స్వేచ్ఛకై పాటుపడ్డారు కానీ అంబేద్కర్ గారు స్త్రీలకు అన్నిట్లో రిజర్వేషన్ పెట్టి వారికి ఇంకొంత అండగా నిలిచారు.కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాదు రాజ్యాంగంతో ఆయన మన దేశానికి ఒక దారి చూపారు.కాలం మారింది అవమానింప పడిన బలహీనులు  బలవంతులు అయ్యారు.బాగా చదివి రిజర్వేషన్లను ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందారు.కానీ ఇంకా కొన్ని పల్లెటూళ్ళలో అంటరానితనం పోలేదు.అధిక జాతుల దౌర్జన్యాలు తగ్గలేదు. ఎస్ టి, ఎస్ సి లా లోనే కాదు బి సి, ఓ సి లలో కూడా పేద వారు ఉన్నారు.పూట కూటికి గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కావాలి . ఈ డబల్యూ ఎస్.  కింద 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.కానీ దాన్ని 100 శాతం తీసుకురావాలి.అలా చేయాలంటే ఒక చట్టం తీసుకురావాలి.కుల నిర్మూలన జరగాలి.నువ్వు ఎస్ టి, నువ్వు ఎస్ సి, నువ్వు బి సి,నువ్వు  ఓ సి అని కుల విభజన జరగకూడదు.అందరిదీ ఒకే కులంగా వుండాలి.అది భారత జాతి అయ్యుండాలి.ఎన్ని రిజర్వేషన్లు పెట్టిన,ఎన్ని చేసినా కుల పిచ్చి పోలేదు. కనీసం మన భావితరాల వారైనా కుల ,మత బేధాలు లేకుండా వుండాలంటే,అందరూ సమానంగా వుండాలంటే, ఈ క్యాస్ట్ సిస్టమ్ నీ తొలగించాలి.కులం అనే మాట ఎవరి నోటనైన వస్తే వారిని కటినంగా శిక్షించాలి. ఎస్ టి, ఎస్ సి లా లోనే కాదు బి సి, ఓ సి లలో కూడా పేద వారు ఉన్నారు.పూట కూటికి గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కావాలి . ఈ డబల్యూ ఎస్.  కింద 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.కానీ దాన్ని 100 శాతం తీసుకురావాలి.అలా చేయాలంటే ఒక చట్టం తీసుకురావాలి.కుల నిర్మూలన జరగాలి.నువ్వు ఎస్ టి, నువ్వు ఎస్ సి, నువ్వు బి సి,నువ్వు  ఓ సి అని కుల విభజన జరగకూడదు.అందరిదీ ఒకే కులంగా వుండాలి.అది భారత జాతి అయ్యుండాలి.ఎన్ని రిజర్వేషన్లు పెట్టిన,ఎన్ని చేసినా కుల పిచ్చి పోలేదు. కనీసం మన భావితరాల వారైనా కుల ,మత బేధాలు లేకుండా వుండాలంటే,అందరూ సమానంగా వుండాలంటే, ఈ క్యాస్ట్ సిస్టమ్ నీ తొలగించాలి.కులం అనే మాట ఎవరి నోటనైన వస్తే వారిని కటినంగా శిక్షించాలి. ఇకపోతే అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా గొప్పవి.ఆయన తెచ్చిన రిజర్వేషన్ ఉండాలి.అందరిది ఒకే కులం కాబట్టి , కుటుంబ సంవత్సరం  ఆదాయం బట్టీ రిజర్వేషన్ వర్తించేలా చేయాలి.అప్పుడే కుల , మత బేధాలు లేకుండా పేద ప్రజలు అందరికీ న్యాయం జరుగుతుంది.ఇలా చేయడం వలన కుల నిర్మూలనతో పాటు ఓ సి,బీసీ లలో ఉన్న పేద ప్రజలకు కూడా 100 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఇలా చేయడం వలన రాజకీయాలలో కూడా మార్పులు వస్తాయి.మా కులం వాడు అని ఓట్లు వేసే చాలా మంది మారుతారు. ఏ గొడవలు లేకుండా అందరు కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తారు.

You've reached the end of published parts.

⏰ Last updated: Aug 04, 2023 ⏰

Add this story to your Library to get notified about new parts!

నవయుగం: కుల నిర్మూలనా (అన్ని కులాల వారికి 100 శాతం రిజర్వేషన్లు)Where stories live. Discover now